- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కరోనా తర్వాత జపాన్‌లో ఫ్లూ మహమ్మారి విజృంభిస్తోంది. ఫ్లూ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడంతో 130కి పైగా పాఠశాలలు, పిల్లల సంరక్షణ కేంద్రాలు మూసివేశారు. 4,000 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. H3N2 జాతి వైరస్, కోవిడ్ సమయంలో తగ్గిన రోగనిరోధక శక్తి, క్రమరహిత వాతావరణం దీనికి కారణాలని నిపుణులు భావిస్తున్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ టీకాలు వేయించుకోవాలని పౌరులను కోరింది. ఇది పెద్ద మహమ్మారిగా మారే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నా, నిరంతర పర్యవేక్షణ అవసరమని హెచ్చరిస్తున్నారు.
- Advertisement -