Saturday, November 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఎర్రగడ్డలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు..బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆందోళన

ఎర్రగడ్డలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు..బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆందోళన

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ముమ్మరంగా తనిఖీలు చేపడుతోంది. ఎర్రగడ్డలోని ప్రేమ్‌ నగర్‌లో బీఆర్‌ఎస్‌ నేత జానీమియా ఇంట్లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టడం ఆందోళనకు దారితీసింది. జానీమియా ఇంట్లో డబ్బులు ఉన్నట్లు సమాచారంతో తనఖీలు నిర్వహించింది. దీంతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిరసన తెలుపుతూ ఆందోళనకు దిగారు. మరోవైపు ఎర్రగడ్డలోని ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా నగదు ఉన్నట్లు బీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. రూ. 6 కోట్ల నగదు ఉన్నట్లు ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చారు. డబ్బులున్నట్లు సమాచారం రావడంతో కాంగ్రెస్ నేత ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్‌ తనిఖీలు చేశారు. మీడియా సమక్షంలో తనఖీలు చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రేమ్‌ నగర్‌లోని కాంగ్రెస్ నేత సాలం షౌజ్‌ ఇంటి వద్దకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో సాలం షౌజ్‌ ఇంట్లో ప్లయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. నగదు దొరకకపోవడంతో సాలం షౌజ్‌ ఇంటి నుంచి సిబ్బంది వెళ్లిపోయారు. ఆయన ఇంటి వద్ద నుంచి బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలను పోలీసులు పంపించివేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -