Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్దేశీయ వినియోగంపై దృష్టి పెట్టాలి

దేశీయ వినియోగంపై దృష్టి పెట్టాలి

- Advertisement -

– అల్యూమినియం పరిశ్రమ నిపుణులు
– అప్పుడే టారిఫ్‌లను ఎదుర్కోగలం
హైదరాబాద్‌ :
అమెరికా విధిస్తోన్న సుంకాలను ఎదుర్కోవడానికి దేశీయ వినిమయంపై దృష్టి పెట్టాలని అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్‌ మానుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (అలెమయి) అధ్యక్షుడు జితేంద్ర చోప్రా అన్నారు. ఇతర దేశాల నుంచి చౌకగా జరుగుతున్న దిగుమతులను తగ్గించాలన్నారు. దేశంలో ప్రతీ ఏడాది 3 మిలియన్‌ టన్నుల వినియమం జరుగుతుందన్నారు. ఇందులో సగం పైగా ఇతర దేశాల నుంచే వస్తోందన్నారు. అమెరికాలో తలసరి అల్యూమినియం వాడకం 17-18 కిలోలు, చైనాలో 20-24 కిలోలుగా ఉండగా.. భారత్‌లో కేవలం 3-4 కిలోలు మాత్రమే ఉందన్నారు. టారిఫ్‌ల నుంచి తప్పించుకోవడానికి దేశీయంగా వినిమయాన్ని పెంచుకోవడం మంచి మార్గమన్నారు. దేశంలోనే మొట్టమొదటి అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్‌కు సంబంధించిన ప్రదర్శన, సందర్శనను సెప్టెంబర్‌ 10-13 తేదిల్లో న్యూఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img