– దాసర్లపల్లిలో స్పెషల్ ఆఫీసర్, పంచాయతీ సెక్రటరీల సంయుక్త పరిశీలన
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం దాసర్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఎల్–3 దశలో ఉన్న లబ్ధిదారుల వివరాలను అధికారులు శనివారం పరిశీలించారు. మండల వ్యవసాయ అధికారి, గ్రామ స్పెషల్ ఆఫీసర్ కొర్ర రమేష్, పంచాయతీ కార్యదర్శి జ్యోతి కలిసి గ్రామంలోని లబ్ధిదారుల ఇళ్ల వద్ద సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వారు లబ్ధిదారుల ఆర్థిక, సామాజిక పరిస్థితులను సమీక్షించి, నిజమైన అర్హులను గుర్తించేందుకు సమగ్రంగా పరిశీలన చేపట్టినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ప్రభుత్వం నిరుపేదలకు సొంత ఇల్లు కల కల్పించాలనే లక్ష్యంతో కృషి చేస్తోందని, అర్హతల పరిశీలనలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తామని అధికారులు పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లలో అర్హతలపై దృష్టి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



