Thursday, January 15, 2026
E-PAPER
Homeఆదిలాబాద్గ్రామ సమస్యలపై దృష్టి పెట్టాలి: ఎంపీడీఓ

గ్రామ సమస్యలపై దృష్టి పెట్టాలి: ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం: గ్రామాల్లో సమస్యలు పరిష్కరించేలా కార్యదర్శులు దృష్టి పెట్టాలని జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్ సూచించారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలన్నారు. బావుల్లో క్లోరినేషన్ చేయించాలని ఆదేశించారు. గ్రామాల్లో ఉన్న ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న మురుగునీటి కాలువలను శుభ్రం చేయించాలన్నారు. విద్యుత్తు త్రాగునీరుకు  ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో కార్యదర్శులు ఉండాలన్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ జలంధర్, ఈజీఎస్ ఏపీవో రవీందర్ వివిధ గ్రామాల  కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -