– చక్రవర్తి హాస్పిటల్ ఎండి.డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డిగుత్తి -కోయలతో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్న డాక్టర్ తరుణ్
నవతెలంగాణ – తాడ్వాయి :
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మొండాలతోగు గుత్తి కోయ గిరిజనులతో చక్రవర్తి ఆస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్ తరుణ్ కుమార్ రెడ్డి సోమవారం గుత్తి కోయిలతో కలిసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డి గుత్తికాయగూడెంలో వలస ఆదివాసీలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. మొదట వారిని గుత్తి కోయలు డోలు వాయిద్యాలు, నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన పుట్టినరోజు సందర్భంగా గుత్తి కోయ 30 కుటుంబాలకు 25 కేజీల ఫైన్ రైస్, పప్పు ఉప్పు కారం, ఉల్లిగడ్డ, నూనె మొదలుకు ఏడు రకాల నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చక్రవర్తి ఆస్పటల్, ఎండి తరుణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. “నా పుట్టినరోజు సందర్భంగా మీ గుత్తి కోయ గూడెంలోనే 30 కుటుంబాల వారికి ఈ ఆపద వచ్చినా.. ఈ రోగం వచ్చిన ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని అన్నారు. ఆయన బర్త్డే సందర్భంగా గుత్తి కోయులకు ఈ ప్రకటన చేశారు. అంతేకాకుండా మంత్రి ఆదేశాల మేరకు మండలంలోని గతంలో తక్కల్లగూడెం గుత్తి కాయగూడంలో పాఠశాల భవనం ఏర్పాటు చేశామని తెలిపారు. మొండాలతోగు గుత్తి కోయ గూడెంలో కూడా పాఠశాల భవనం శంకుస్థాపనాయి నిర్మాణం అవుతుందన్నారు. త్వరలో కూడా దీన్ని పూర్తి చేసి అందిస్తామన్నారు. పేద వారికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చక్రవర్తి హాస్పటల్ సీఈఓ సూర్య ప్రకాష్, మేనేజర్ వెంకన్న, తాడ్వాయి ఏరియా మేనేజర్ శరత్, మేనేజ్మెంట్ టీం సభ్యులు, హర్షద్, రమేష్ భాస్కర్ నవీన్ శరత్ యాకూబ్, ఫారూఖ్, అంబులెన్స్ రమేష్, గుత్తి కాయ గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.