Friday, December 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపాఠశాలలో ఫుడ్ పాయిజన్..100 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత

పాఠశాలలో ఫుడ్ పాయిజన్..100 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ముషీరాబాద్‌లోని బాగ్ లింగంపల్లిలో తెలంగాణ అల్పసంఖ్యాకుల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జ‌రిగింది. నిన్న రాత్రి బీరకాయ పప్పు, క్యారెట్ ఫ్రై, పెరుగు తినడంతో దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి కొంతమంది వాంతులు చేసుకోవ‌డంతో టీచర్లు గుర్తించారు. ఉదయం అల్పాహారం అందించారు మరి కొంతమంది విద్యార్థులు అస్వస్థత గురి కావడంతో అప్రమత్తమైన టీచర్లు మూడు 108లలో కింగ్ కోటి ఆస్ప‌త్రికి విద్యార్థులను తరలించారు. అయితే వెంటనే విద్యార్థుల‌ను తరలించకుండా టీచ‌ర్లు ఆలస్యం చేస్తున్నారు. శుక్ర‌వారం మధ్యాహ్నం ఒంటిగంటకు మరి కొంత మంది వ్యాన్‌లో విద్యార్థులను ఆస్ప‌త్రికి తరలించారు. ఈ ఘ‌ట‌నపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -