– తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థకు ఏఐఎఫ్‌ఎఫ్ ప్రోత్సాహక అవార్డు ప్రదానం
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్)ను ప్రతిష్టాత్మక ఏఐఎఫ్‌ఎఫ్ (ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్) పురస్కారం వరించింది. 2024-25 ఏడాదిలో తెలంగాణలో ఫుట్‌బాల్ అభివృద్దికి విశేష కృషి చేయటంతో పాటు హైదరాబాద్‌ను ఫుట్‌బాల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు శాట్జ్ పలు అంతర్జాతీయ ఈవెంట్లకు ఆతిథ్యం అందించింది. భువనేశ్వర్‌లో జరిగిన ఏఐఎఫ్‌ఎఫ్ వార్షిక అవార్డుల వేడుకలో శాట్జ్ వీసీ, ఎండీ సోనిబాలా దేవి ‘ఫుట్‌బాల్ ప్రోత్సాహక’ పురస్కారం అందుకుంది. ఈ పురస్కారం తెలంగాణ ఫుట్‌బాల్‌కు దక్కిన గౌరవమని, రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి ప్రేరణగా నిలుస్తుందని సోనిబాలా దేవి అన్నారు. ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షుడు కళ్యాణ్ చౌబె, ఒడిశా ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్ సహా అన్ని రాష్ట్రాల ఫుట్‌బాల్ సంఘాల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
శాట్జ్‌కు ఫుట్‌బాల్ పురస్కారం
- Advertisement -
- Advertisement -