Saturday, June 14, 2025
E-PAPER
Homeమానవికండ బలం కోసం...

కండ బలం కోసం…

- Advertisement -

శరీరం బలంగా, దఢంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే, బిజీ లైఫ్‌ స్టైల్‌, పొల్యూషన్‌తో శరీరం చాలా బలహీనపడుతుంది. అనేక వ్యాధులకు నిలయంగా మారుతుంది. చాలా మంది మెట్లు ఎక్కేటప్పుడు ఊపిరి పీల్చుకోవడం లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు చాలా త్వరగా అలసిపోతుంటారు. ఇవన్నీ బలహీనతకు సంకేతాలు. అయితే, కండ బలంతో పాటు స్టామినా పెంచుకోవాలంటే డైట్‌లో కొన్ని సూపర్‌ ఫుడ్స్‌ చేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు. వీటిని ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అంతేకాకుండా కండ బలం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ సూపర్‌ ఫుడ్స్‌ ఏంటో చూద్దాం..
పీనట్స్‌
మీరు బలహీనంగా ఉంటే.. శక్తిని పెంచుకోవడానికి పీనట్స్‌ బాగా ఉపయోగపడతాయి. వీటిల్లో ప్రొటీన్‌, ఒమేగా 3, మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం యొక్క శక్తి స్థాయి పెరుగుతుంది. అంతేకాకుండా కండరాలూ బలపడతాయి.
బాదం పప్పు..
బాదంపప్పు తీసుకోవడం వల్ల శరీరం యొక్క స్టామినా పెరుగుతుంది. బాదంలో ప్రొటీన్లు, విటమిన్‌ ఇ, ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్‌, ఫైబర్‌, పొటాషియం, మాంగనీస్‌ వంటి ఖనిజాలు లభిస్తాయి. బాదంపప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. బాదం పప్పు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయి నియంత్రణలో ఉంటుంది. ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి పవర్‌ అందుతుంది. కండరాలు కూడా బలపడతాయని నిపుణులు అంటున్నారు.
అరటి పండు..
అరటి పండులో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అలాగే అరటిలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. రోజు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అరటి పండు ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తుంది.
ఆకుకూరలు..
ఆకుకూరలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. శరీరం యొక్క స్టామినాను పెంచడానికి ఆకుకూరలు తోడ్పడతాయి. పాలకూర, బచ్చలి కూర, తోట కూర, మెంతి కూర, మునగాకు వంటి ఆకుకూరలు తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆకు కూరల్లో ఐరన్‌, విటమిన్లు, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని రక్తహీనత తొలగిపోయి కండరాలు, ఎముకలు దఢంగా మారతాయి.
సిట్రస్‌ ఫ్రూట్స్‌
నారింజ, నిమ్మ, ఉసిరి వంటి సిట్రస్‌ ఫ్రూట్స్‌ వల్ల శరీర స్టామినా డబుల్‌ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లు విటమిన్‌ సి మాత్రమే కాదు.. వీటిలో పుష్కలంగా ఫైబర్‌, కాల్షియం, ఫోలేట్‌, థయామిన్‌, విటమిన్‌ బి6 ఉంటాయి. ఈ పండ్లను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -