Wednesday, October 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమా ఊరి హక్కుల కోసం, భూమి రక్షణ కోసం..

మా ఊరి హక్కుల కోసం, భూమి రక్షణ కోసం..

- Advertisement -

భూ కబ్జాలకు వ్యతిరేకంగా ‘రిలే నిరాహార దీక్ష’
మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌
తహసీల్‌ ఎదుట పట్టణ ప్రజల ధర్నా
నవతెలంగాణ- బాలానగర్‌
బాలానగర్‌ పట్టణ ప్రజలు భూకబ్జాలకు వ్యతిరేకంగా ”మా ఊరి హక్కుల కోసం, భూమి రక్షణ కోసం” అంటూ గురువారం మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం శాంతియూత రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బాలానగర్‌ పట్టణ వాసులు కరాటే రవికుమార్‌, కేవీ మధు మాట్లాడుతూ.. తమ ఊరిలోని దేవాలయాల భూములు, ప్రభుత్వ భూములను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. ఈ విషయంపై గ్రామ ప్రజలు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోకపోవడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా, గ్రామంలో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌, తహసీల్దార్‌కు సైతం వినతి పత్రాలు అందజేశామన్నారు. ఇప్పటికైనా తమ గ్రామ భూములను కాపాడి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలానగర్‌ పట్టణ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -