Saturday, May 10, 2025
Homeతాజా వార్తలునేడు 10 గంటలకు విదేశాంగ శాఖ ప్రెస్ మీట్

నేడు 10 గంటలకు విదేశాంగ శాఖ ప్రెస్ మీట్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి. గురువారం సాయంత్రం నుంచి ఇరు దేశాలు పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా శుక్రవారం రాత్రి నుంచి ప్రత్యక్ష దాడులకు దిగడం‌తో సరిహద్దు ప్రాంతాల్లో బాంబుల మోత మోగుతోంది. కశ్మీర్లోని LOC వెంట 26 ప్రాంతాల్లో పాక్ భారీగా డ్రోన్ దాడులకు పాల్పడింది. ఈ దాడులను ధీటుగా తిప్పి కొట్టిన భారత్.. పాకిస్థాన్‌లోని ముఖ్యమైన మూడు ఎయిర్ బేస్‌ల మీద బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకు పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజామున 5:45కు నిర్వహించాల్సిన ఇండియన్ ఆర్మీ ప్రెస్ మీట్ వాయిదా పడింది. ఉదయం 10 గంటలకు విదేశాంగ శాఖ మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తాజాగా కేంద్రం తెలిపింది. పాకిస్థాన్ పూర్తిస్థాయి మిలిటరీ ఆపరేషన్ ప్రకటించిన నేపథ్యంలో భారత్ కూడా ఎలాంటి ప్రకటన చేయనుందనే ఉత్కంఠ నెలకొంది.
కాగా, భారత్‌పై పూర్తి స్థాయి మిలటరీ ఆపరేషన్ చేపడుతున్నట్లుగా పాకిస్థాన్ శనివారం తెల్లవారుజామున ప్రకటించింది. ఆ ఆపరేషన్‌కు ‘బన్‌యన్ ఉల్ మర్సూస్’ అని పేరు పెట్టినట్లు సమాచారం. దీంతో నేటి నుంచి పాకిస్థాన్ భారత్‌పై దాడులను మరింత తీవ్ర తరం చేయనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -