Thursday, March 19, 2026
E-PAPER
Homeజిల్లాలుకోతల బెడతతో ఇబ్బందులు

కోతల బెడతతో ఇబ్బందులు

- Advertisement -

చింపాంజీ వేషంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం

కోతుల నివారణ కోసం ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలి: సర్పంచ్ రమేష్

నవతెలంగాణ – మిరుదొడ్డి

ఏ ఊరు చూసినా ఏ పల్లె చూసినా ఉదయం లేవగానే వానర సైన్యమే కనిపిస్తా ఉంటుంది. వానర సైన్యం గ్రామస్తులను పెట్టే ఇబ్బందులు ఇంత అంతా కావని చెప్పాలి. ప్రతిరోజు ఇలా పైనే తిరిగే వానరసైన్యంతో ప్రజలు తీర ఇబ్బంది పడవవుతున్నారు. వేసిన పంటలు కాపాడుకోవాలంటే మొత్తం కోతుల తో నానా ఇబ్బంది పాలవుతున్న రైతన్నలు. ఇట్టి విషయాన్ని గ్రామ పాలకవర్గానికి ప్రజలు తెలపడంతో నూతన గ్రామపంచాయతీ పాలకవర్గం నడుము బిగించారు. ఏకంగా వార్డు సభ్యులే చింపాంజీ వేషం ధరించి కోతుల నివారించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం లింగుపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో కోతులను గ్రామం నుండి తరిమికొట్టేందుకు వినూత్న ప్రయత్నంతోఏకంగా రెండో వార్డు సభ్యుడు చెవుల మిషన్ కిషన్ రంగంలోకి దిగి చింపాంజీ వేషధారణ ధరించి కోతులను తరిమికొడుతున్నారు.
గ్రామంలో తిరుగుతూ కోతులను పారదోలెందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ తో పాటు వార్డు సభ్యులు గ్రామాలలో కోతుల చాలా ఎక్కువగా ఉంది అన్నారు. అంతేకాకుండాపల్లెల్లో ఏ సమస్య అయినా ముందుగా గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచికే చెప్పుకుంటారని అన్నారు. అందులో భాగంగానే చింపాంజీ, పులి బొమ్మలతో కోతులను నివారించుతున్నామని అన్నారు. గ్రామాల్లోకి కోతులు రావడానికి గల కారణాలు అడవులను లేకుండా చేయడానికి కారణమే అని అన్నారు. అడవి ప్రాంతంలో చెట్లను పెంచి కోతులకు కావాల్సిన సంరక్షణను ఏర్పాటు చేస్తే అడవి నుంచి గ్రామాలకు వచ్చిన కోతులు మళ్లీ అడవి బాట పడతాయని అన్నారు. ప్రభుత్వాలు స్పందించాలి కోతులను నివారించాలి ప్రజల బాధలను కోతుల నుండి విముక్తి కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వము అని అన్నారు.

కోతుల బెడదతో ఇబ్బందులు: చెవుల కిషన్, వార్డు సభ్యుడు

గ్రామాల్లో కోతులు ఎక్కువగా ఉండటం వలన మా సర్పంచ్ చింపాంజీ డ్రస్ తేవడంతో గ్రామాల్లో తిరుగుతూ కోతులను తరిమికొడుతున్నాము. మా యొక్క పాలకవర్గం సహకారంతో ఏకంగా నేనే ఈ కోతుల బెడుతుంది ప్రజలకు ఎలాంటి కలగా వద్దనే ఉద్దేశంతో కోతులను తరిమికొడుతున్నాను. రోజు ఉదయం విద్యార్థులు స్కూలుకు వెళ్లాలంటే కోతల భయానికి స్కూలుకు వెళ్లకుండా ప్రతిరోజు విద్యార్థులు తల్లిదండ్రులకు ఇబ్బంది కలుగుతుంది. ఉదయం నుండి రాత్రి వరకు వద్యార్థులు ప్రజలు కూడా కూతల భయానికి బయటకు రావాలంటే భయంతో గురవుతున్నారు. కోతులు నివారణకు ఒక ప్రయత్నం చేయడం జరిగింది. చింపాంజీ పులివేశంతో గ్రామంలో కూతలు కొడుతున్నాము.

కోతులు గ్రామాల్లోకి రాకుండా ఫారెస్ట్ అధికారులు చేపట్టాలి: సర్పంచ్ రమేష్ లింగుపల్లి

అడవులను నరికి వేయడం మూలంగానే వానరసైన్యం మొత్తం గ్రామాల్లో చేరుకుంది. గ్రామంలో ప్రతిరోజు ఉదయం లేవగానే కోతులే దర్శనమిస్తున్నాయి. ప్రతిరోజు విద్యార్థులు స్కూలుకు వెళ్లాలంటే ఇబ్బంది పాలవుతున్నారు. రైతులు వేసిన పంటలను కూడా కోతులు మొత్తం పాడు చేస్తున్నాయి. అప్పులు చేసి వేసిన పంటలు కాపాడుకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బంది పాలవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు చొరవ తీసుకొని కోతుల నివారణకు చర్యలు చేపట్టాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -