- జిల్లా అధ్యక్షులుగా భూంపల్లి సంగమేశ్వర్
నవతెలంగాణ-కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాల ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ (ఎంఈ డబ్ల్యూఎస్)రాష్ట్ర కార్యదర్శులు పాత రాము, అయ్యాల సంతోష్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కమిటీనీ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా భూంపల్లి సంగమేశ్వర్, ప్రధాన కార్యదర్శి దొనకంటి పాండురంగం, కోశాధికారి పడిగే రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టు రవీందర్, ఉపాధ్యక్షులుగా గైని ప్రవీణ్, ఇటికెల సత్యం, సాయిలు, పెరుమాండ్ల మహేందర్, కార్యదర్శి నాంపల్లి, సహాయ కార్యదర్శి లక్ష్మి నారాయణ, కోర్డినేటర్ సంజీవ్, కల్చరల్ సెక్రటరీ కౌడి రవీందర్, సలహాదారులుగా బొంద రాజకుమార్, పెరుమాండ్ల రాము, జిల్లా కార్యవర్గం అనంతరం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ.. పూలే, అంబేద్కర్, కాన్షీరాంల ఆశయాలను ప్రతి ఇంటికి చేర్చాలని, పే బ్యాక్‌లో సొసైటీలో భాగంగా ప్రతిఉద్యోగి భాగస్వాములు కావాలని, సాంస్కృతిక నిర్మాణంలో పాల్గొని, మాలల ఐక్యతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దుబాసి నరేందర్, సాయి మౌర్య,సాయి గౌతం, నాంపల్లి, ఏసు రత్నం బొంద రాజకుమార్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.



