బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా మాజీ అధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత ప్రతిపక్ష నాయకురాలు, 72 ఏండ్ల ఫెర్నాండెజ్‌కు అవినీతి కేసులో ఆ దేశ సుప్రీంకోర్టు ఆరేండ్లు జైలు శిక్ష విధించింది. అలాగే ఆమె జీవితాంతం ప్రజా పదవీ బాధ్యతలు స్వీకరించకుండా నిషేధం విధించింది. పబ్లిక్ రోడ్‌వర్క్స్ కాంట్రాక్టులు ఇవ్వడంలో అవినీతి చర్యలకు పాల్పడిన కేసులో నేరం రుజవయినందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హోరాసియో రోసాట్టి, కార్లోస్ రోసెన్‌కాంట్జ్ర్, రికార్డో లోరెంజెట్టి ఈ నెల 10న ఈ శిక్ష విధించారు. కోర్టు ముందు లొంగిపోవడానికి ఐదు రోజుల సమయం ఇచ్చారు. నెస్టర్ కిర్చ్నర్ అధ్యక్షులుగా ఉన్న సమయంలోనూ (2003 నుంచి 2007 వరకూ), తన సొంత అధ్యక్ష పదవీ కాలంలోనూ (2007 నుంచి 2015) వరకూ ఫెర్నాండెజ్ ఈ నేరాలకు పాల్పడినట్లు రుజవయింది. సెప్టెంబర్‌లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఈ నెల ప్రారంభంలోనే ఫెర్నాండెజ్ ప్రకటించారు. దీనికి కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ తీర్పు రావడం ఆమెకు ఎదురు దెబ్బగా భావిస్తున్నారు. ఈ తీర్పుపై ఫెర్నాండెజ్ తీవ్రంగా స్పందించారు. అర్జెంటీనా న్యాయవ్యవస్థ ఒక రాజకీయ పార్టీలా పనిచేస్తుందని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా, ఫెర్నాండెజ్‌కు మద్దతుగా వేలాది మంది ఆమె అభిమానులు దేశవ్యాప్తంగా వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు.
అర్జెంటీనా మాజీ అధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్‌కు ఆరేండ్లు జైలు శిక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES