- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇవాళ ఉదయం హైదరాబాద్ అమీర్‌పేటలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆమె నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళుర్పిస్తున్నారు.
- Advertisement -



