Thursday, September 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలు కవితతో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ భేటీ!..

 కవితతో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ భేటీ!..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. బీఆర్ఎస్‍కు గుడ్ బై చెప్పి భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టిన కవితతో వరుసగా సీనియర్ నేతలు భేటీ అవుతుండటం సంచలనంగా మారుతోంది. ఇటీవలే జాగృతి అధ్యక్షురాలితో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పి.విష్ణువర్ధన్ రెడ్డి భేటీ కాగా తాజాగా కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ భేటీ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిపినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో కవిత ఉంటారనే ప్రచారం నేపథ్యంలో ఇలా ముఖ్యనేతలు వరుసగా భేటీ కావడంతో కవిత వ్యవహారం పొలిటికల్ కారిడార్ లో ఆసక్తి రేపుతోంది.

గవర్నర్ కోటాలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో పాటు అమీర్ అలీఖాన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. వీరి నియామకం విషయంలో బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లడంతో కోదండరాం, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీ పదవులను సర్వోన్నత న్యాయస్థానం రద్ధు చేసింది. దీంతో గవర్నర్ కోటాలో తిరిగి కోదండరాం పేరును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆమోదించిన రాష్ట్ర కేబినెట్ అమీర్ అలీఖాన్ కు మాత్రం షాక్ ఇచ్చింది. ఆయన స్థానంలో మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్ కు అవకాశం కల్పించింది. బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లడం కారణంగా తన పదవి పోవడం, కోదండరాంకు అవకాశం ఇచ్చినా తనకు మళ్లీ అవకాశం ఇవ్వని నేపథ్యంలో అమీర్ అలీఖాన్ కవితతో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు దారి తీస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -