- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ ఇంట్లో చోరీ జరిగింది. పుణె జిల్లా మావల్ తాలూకాలోని టికోణా పేట్ ప్రాంతంలో అజారుద్దీన్ భార్య సంగీతా బిజ్లానీకి చెందిన లోనావాలా బంగ్లాలో దొంగతనం జరిగిన ఘటనపై కేసు నమోదైంది. గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి రూ.50,000 నగదు, రూ.7,000 విలువైన టీవీని అపహరించారని పుణె రూరల్ పోలీసులు వెల్లడించారు. మార్చి 7 మరియు జూలై 18 మధ్య ఈ దొంగతనం జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు.
- Advertisement -