Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంయుపిఎస్సీ ఛైర్మన్‌గా మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్‌

యుపిఎస్సీ ఛైర్మన్‌గా మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సీ) ఛైర్మన్‌గా మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్‌ను నియమిస్తూ కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 29న ప్రీతి సుడాన్ పదవీకాలం ముగియడంతో యుపిఎస్సీ ఛైర్మన్ పదవి ఖాళీ కానుంది. ఈ పదవికి అజయ్ కుమార్ నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదించినట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. కేరళ కేడర్‌కు చెందిన 1985 బ్యాచ్ రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) అధికారి అయిన అజయ్ కుమార్ 2019 ఆగస్టు 23 నుండి 2022 అక్టోబర్ 31 వరకు రక్షణ కార్యదర్శిగా పనిచేశారు. ఐఏఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్) వంటి వాటికి అధికారులను ఎంపిక చేయడానికి యుపిఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలను నిర్వహిస్తుంది. దీనికి ఒక చైర్మన్ నాయకత్వం వహిస్తారు. దీనిలో గరిష్టంగా 10 మంది సభ్యులు ఉండవచ్చు. ప్రస్తుతం కమిషన్‌లో ఇద్దరు సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నాయి. యుపిఎస్సీ ఛైర్మన్‌ను పదవీకాలం ఆరు సంవత్సరాలు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad