నవతెలంగాణ-హైదరాబాద్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు ఈ స్థానంలో ప్రీతి సుదాన్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆమె పదవీ కాలం ఏప్రిల్ 29న ముగిసింది. దీంతో అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉండడంతో అజయ్ కుమార్‌ను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ కొత్త ఛైర్మన్ నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు.
అజయ్ కుమార్ 1985 బ్యాచ్ కేరళ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన 2019 ఆగస్టు 23, నుంచి అక్టోబర్ 31, 2022 వరకు రక్షణశాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. యూపీఎస్సీ దేశవ్యాప్తంగా సివిల్ సర్వీస్ పరీక్షలను నిర్వహిస్తుంటుంది. ఈ కమిషన్‌లో ఛైర్మన్ సహా అత్యధికంగా 10 మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం కమిషన్‌లో ఇద్దరు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. యూపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే వ్యక్తి గరిష్ఠంగా ఆరు సంవత్సరాలు లేదా 65 ఏళ్లు వయసు నిండేవరకు కొనసాగవచ్చు.
యూపీఎస్సీ ఛైర్మన్‌గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్
- Advertisement -
- Advertisement -