Wednesday, December 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాడు భర్త, నేడు భార్య సర్పంచ్ గా 

నాడు భర్త, నేడు భార్య సర్పంచ్ గా 

- Advertisement -

– ప్రజాసేవలో భార్యాభర్తలు 
– ముత్యాలమ్మగూడెం చరిత్రలో నూతన అధ్యాయం 
నవతెలంగాణ-కట్టంగూర్ : మండలంలోని ముత్యాలమ్మ గూడెం గ్రామంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సుంకరబోయిన సంధ్య వెంకన్నలు గ్రామ చరిత్రలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. 2019 పంచాయతీ ఎన్నికల్లో సుంకరబోయిన వెంకన్న గెలిచి సర్పంచ్ గా ఐదేళ్లు గ్రామ అభివృద్ధి కొరకు కృషి చేశారు. ప్రజా సేవే లక్ష్యంగా సాగిన ఆయన పాలన నేడు మరో రూపంలో కొనసాగుతుంది. ఆ ప్రజాసేవ పరంపరను నేడు ఆయన భార్య సంధ్య సర్పంచ్ గా ఎన్నికల్లో గెలిచి గ్రామ భవిష్యత్తుకు నాయకత్వం వహించనుంది. పదవుల కోసం కాదు ప్రజాసేవ కోసమే రాజకీయాలు అనే లక్ష్యంతో ఉన్నత చదువులు చదివిన వెంకన్న ఉద్యోగ మార్గాన్ని పక్కకు పెట్టి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ జెడ్పిటిసి మాద యాదగిరి ప్రోద్బలంతో  2014లో  సర్పంచ్ గా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినా కృంగిపోకుండా పదవులు ఉన్నా లేకున్నా ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తూ మళ్ళీ 2019లో సర్పంచ్ గా పోటీ చేసి గెలుపొందారు. తన పరిపాలన కాలంలో గ్రామంలో సిసి రోడ్లు, మురుగుకాలువలు తోపాటు మౌలిక సదుపాయాల కల్పన కొరకు పాటుపడ్డారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయడానికి కృషి చేశారు. అదే ప్రజల విశ్వాసం నేడు తన భార్య సంధ్యకు బలంగా మారింది. గ్రామ ప్రజల నమ్మకం గెలుచుకొని నేడు సర్పంచ్ గా ప్రజాసేవ చేసేందుకు అవకాశం లభించింది. ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు, ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించేందుకు, పాలనలో పారదర్శకతతో ప్రజలందరి సహకారంతో ముందుకు సాగుతానని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు తమ భార్యాభర్తల పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కొనసాగుతామని, తన గెలుపు కొరకు కృషిచేసిన వారికి, తమకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -