- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అండర్-19 ప్రపంచ కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన 40 ఏళ్ల భారత మాజీ క్రికెటర్ రాజేష్ బానిక్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. పశ్చిమ త్రిపురలోని ఆనందనగర్ సమీపంలో శుక్రవారం రాత్రి బైక్‌పై వెళ్తున్న రాజేష్ ప్రమాదానికి గురయ్యారు. హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా రాజేష్ బానిక్ భారత మాజీ స్టార్స్ ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు వంటి ప్రముఖ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను షేర్ చేసుకున్నారు.
- Advertisement -



