Thursday, April 9, 2026
E-PAPER
Homeజిల్లాలుజుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఉగాది శుభాకాంక్షలు

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఉగాది శుభాకాంక్షలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్

జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు రైతులకు నాయకులకు అందరికీ పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెల్పడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మావి చిగురు పలకరింతలు. కోకిల గానాల కచేరీలు. వేపపూల పలకరింతలు.లేతమామిడి వగరులు. పచ్చగ మెరిసే తోరణాలు అన్నీ కలిపి ఆస్వాదించమనే అచ్చమైన స్వచ్చమైన పండగ ఉగాది అని తెలిపారు.

తెలుగు లోగిళ్ళలో ఆనందాల పునాది…..!!

జీవితంలోని ప్రతీ రుచినీ ఆనందంగా స్వీకరించమని ఆత్మీయంగా ఆహ్వానించమని చేదునీ తీపినీ సమంగా చూడమని ఎన్నో భావాల కలబోతే జీవితమని చాటి చెప్పె ఆచారాల విరిబోణి అని అన్నారు. ఇంటింటా దీపకాంతులు పూల గంధాల పరిమళాలు ప్రకృతినోసారి తలచుకోమంటూ సాంప్రదాయపు సందేశాలు, నూతన సంవత్సర ఆగమనంతో ఆశల కొమ్మకు వేసే అంకురాలు జాతకాల మంతనాలతో కొత్త కోరికల కోలాహలాలు, భవిష్యత్ ప్రణాళికల తతంగాలు మంచిని ఆశిస్తూ పొందే ఆశీర్వాదాలు,ప్రతీ మనసులో ప్రశాంతమై ఆవహిస్తూ ప్రతీ రోజు చూడాలి ఆనందమయ ఉదయాలు. జుక్కల్ నియోజకవర్గం ప్రజలందరికి పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -