Wednesday, October 15, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంకెన్యా మాజీ ప్రధాని రైలా ఒటింగా కేరళలో గుండెపోటుతో మృతి

కెన్యా మాజీ ప్రధాని రైలా ఒటింగా కేరళలో గుండెపోటుతో మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కెన్యా మాజీ ప్రధాని రైలా ఒటింగా (80) కేరళలోని ఎర్నాకుళం జిల్లా కూతట్టుకుళంలోని శ్రీధరీయం ఆయుర్వేద నేత్ర ఆసుపత్రిలో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఉదయం నడక సమయంలో హార్ట్ అటాక్ రావడంతో మరణించినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. గత ఐదు రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్న ఆయనతో కుమార్తె, వ్యక్తిగత వైద్యుడు ఉన్నారు. ఆయన మృతదేహాన్ని కెన్యా రాయబార కార్యాలయం మార్గదర్శకత్వంతో ఆ దేశానికి తరలించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -