Monday, July 14, 2025
E-PAPER
Homeజాతీయంకేరళ మాజీ సీఎం వీఎస్‌కు అస్వస్థత

కేరళ మాజీ సీఎం వీఎస్‌కు అస్వస్థత

- Advertisement -

ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో

సీపీఐ(ఎం) సీనియర్‌ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్‌ అచ్యుతానందన్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన సోమవారం తిరువనంతపురంలోని పట్టోంలో శ్రీ ఉత్రాడోం తిరునాల్‌ (ఎస్‌యూటీ) ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు. 2019లో స్ట్రోక్‌ తో మంచం పట్టిన అచ్యుతానందన్‌ సోమవారం ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నారు. గతేడాది అక్టోబర్‌ 20న ఆయన 101 ఏడాదిలోకి అడుగుపెట్టారు. తిరువనంతపురంలోని బార్టన్‌హిల్‌లోని తన కుమారుడు వీఎస్‌ అరుణ్‌ కుమార్‌ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -