- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పరిగి పర్యటనకు బయలుదేరిన మాజీ మంత్రి హరీశ్‌రావును శంషాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేశారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇతర బీఆర్ఎస్ నేతలూ బయటకు వచ్చారు. ఇవాళ పరిగి వెళ్తుండగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తున్న బాధితులను కలిసేందుకు ఆయన వెళ్లకుండా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. హరీశ్ రావు నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి, ఆయనను బయటకు రాకుండా అడ్డుకున్నారు.
- Advertisement -



