నవతెలంగాణ-హైదరాబాద్: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. 85 రోజుల పాటు జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనపై ఎనిమిది కేసులు నమోదు చేయగా.. అన్నిట్లో బెయిల్ రావడంతో ఈరోజు విడుదల అయ్యారు. జైలు నుంచి బయటకు రాగానే ఆయనకు కాకాణి పూజిత, ఎమ్మెల్సీలు మురళీ, చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఇతర నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్థన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఏడు పీటీ వారెంట్స్ వేశారని, ఎన్నికల సమయంలో జరిగిన లిక్కర్ కేసులు తిరిగి ఓపెన్ చేశారని పేర్కొన్నారు. ఇలాంటి అక్రమ కేసులకి, పీటీ వారెంట్ లకి భయపడేది లేదని ఆయన అన్నారు. నిజానికి మంగళవారమే ఆయన విడుదల కావాల్సింది. అయితే, బెయిల్ పత్రాలను జిల్లా జైలుకు తీసుకురావడంలో జాప్యం కారణంగా వాయిదా పడింది.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES