- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రైల్వే మాజీ మంత్రి, టీఎంసీ నేత ముకుల్ రాయ్(71) గుండెపోటుతో కన్నుమూశారు. కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో ఆయన చనిపోయినట్లు కుమారుడు సుభ్రాంశు వెల్లడించారు. ముకుల్ ఒకప్పుడు టీఎంసీ చీఫ్, సీఎం మమతకు సన్నిహితంగా ఉండేవారు. పార్టీలో రెండో స్థానంలో పరిగణించేవారు. అయితే 2017లో ఆయన బీజేపీలో చేరారు. 18 ఎంపీ సీట్లు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. 2021లో కృష్ణానగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మళ్లీ టీఎంసీలో చేరారు.
- Advertisement -



