Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 

ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ -పరకాల 
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గురువారం పరకాల మండలం పోచారం గ్రామంలో రెండు వేర్వేరు ఘటనల్లో బాధితులను పరామర్శించారు. ఇటీవలే పిడుగుపాటు కారణంగా మృతిచెందిన కూస(గోనె) మహిపాల్ కుటుంబాన్ని ధర్మారెడ్డి పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మహిపాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే రెవెన్యూ అధికారులతో ఫోన్లో మాట్లాడి, పిడుగుపాటుతో మృతిచెందిన మహిపాల్ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా వచ్చే తక్షణ సహాయాన్ని వీలైనంత త్వరగా అందేలా చూడాలని కోరారు. మృతుడి కుటుంబానికి అన్నివిధాలా ఆదుకుంటామని ఈ సందర్భంగా ధర్మారెడ్డి హామీ ఇచ్చారు.

 రోడ్డు ప్రమాద బాధితుడికి పరామర్శ
అనంతరం.. అదే గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు గడ్డం చంద్రమౌళి ఇటీవలే రోడ్డుప్రమాదంలో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న వారిని కూడా మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరు, గాయాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ రెండు కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే వెంట మండల బిఆర్ఎస్ నాయకులు సమ్మిరెడ్డి,మాదారం పిఎసిఎస్ సహాకార సోసైటీ చైర్మన్ లింగమూర్తి, మాజీ ఎంపిటిసి కోరె రమేష్ , ప్రకాష్ రావు కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -