నవతెలంగాణ -ముధోల్
ముధోల్ మండలంలోని ఆష్ట గ్రామంలో ఇటీవల మాజీ ఎంపిటిసి సభ్యుడు సురుగుల పోశేట్టి అనారోగ్యానికి గురయ్యారు. ఈవిషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ముధోల్ నియోజకవర్గం ఇంచార్జి మాజీ శాసనసభ్యులు బోస్లే నారాయణరావు పటేల్ సోమవారం గ్రామానికి వెళ్లి పరామర్శించారు.మాజీ ఎంపీటీసీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చంద్రే, ముత్యం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల గంగారెడ్డి, నాయకులు పతంగి కిషన్,రావుల శ్రీనివాస్,సాయరేడ్డి, శ్రీనివాస్ శరత్, పోతారెడ్డి, శివాజీ, దిగంబర్, పల్లె నగేష్, ఎస్ కె నాజీమ్, గౌతమ్, ప్రభు, తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీటీసీకి మాజీ ఎమ్మెల్యే పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES