- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యకు డాక్టరేట్ లభించింది. శనివారం చెన్నై, మైలాపూర్ భారతీయ విద్యా భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా, నిబద్ధతైన సేవలు అందించినందుకు గాను యూనివర్సిటీ కమిటీ గుమ్మడి నరసయ్యను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొంది.
- Advertisement -



