Friday, March 27, 2026
E-PAPER
Homeజిల్లాలుశ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీరామాలయం (శ్రీ గోవింద్ మహారాజ్ మఠ్ సంస్థాన్)లో శ్రీరామనవమి సందర్భంగా మొదటి రోజు శ్రీ రాముని జన్మోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగాయి. ఈ భక్తి కార్యక్రమానికి పాల్గొన్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే వెండి ఉయ్యాలలో కొలువుదీరిన బాల రామునికి దర్శించుకోవడమే కాకుండా, వెండి ఉయ్యాలను ఊపి నామకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరామాలయంలో ప్రత్యేక ప్రజలు చేసిన మాజీ ఎమ్మెల్యే షిండేకు మఠాధిపతి శ్రీ గోపాల్ గోవింద్ మహరాజ్ ఆశీర్వదించారు. ఈ భక్తి కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు సైతం పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -