నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ నియోజకవర్గ మహిళా బిడ్డలకు, అక్కా చెల్లెలకు జుక్కల్ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు ప్రజలకు తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిక ప్రతీక, మన ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి అద్దం పట్టేది బతుకమ్మ పండుగ అని అన్నారు. 9 రోజులపాటు సాగే ఈ పూల వేడుకలు ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని అన్నారు. తీరొక్క పువ్వులతో 9 రోజులపాటు ఆట, పాటలతో ఆనంద్ ఉత్సవాల నడుమ ప్రకృతిని ఆరాధిస్తూ ఆడబిడ్డల సంబురంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ అని తెలిపారు. జుక్కల్ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించే విధంగా దీవించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. పితృదేవతలకు ఎంతో పవిత్రమైన అమావాస్య “పీతర మాస” అని తెలంగాణ జానపదాలలో పిలుస్తారని అన్నారు. అంటే ఈ దినాన పితృదేవతలకు సమర్పించే పూజలన్నీ వారి ప్రసాదాలుగా భావించబడతాయి. నువ్వులు, బియ్యం నూకలు నైవేద్యంగా పెడతారు అని పేర్కొన్నారు.
బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే షిండే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES