Sunday, May 18, 2025
Homeతాజా వార్తలుమాజీ ఎంపీ అరెస్ట్

మాజీ ఎంపీ అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టీడీపీ కార్యకర్త ఇసకపల్లి రాజుపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. గతరాత్రి అమరావతి రాజధాని పరిధిలోని ఉద్ధండరాయునిపాలెంలోకి ఓ కారు వేగంగా దూసుకువచ్చింది. దాంతో, ఆ కారు డ్రైవర్ ను టీడీపీ కార్యకర్త రాజు మందలించారు. ఈ నేపథ్యంలో, రాజుపై మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు దాడి చేసి, అతడిని సురేశ్ ఇంటికి బలవంతంగా తీసుకెళ్లినట్టు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ రాజుపై నందిగం సురేశ్, అతడి సోదరుడు ప్రభుదాస్ దాడి చేశారని బాధితుడి భార్య లక్ష్మి తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -