- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి ఢిల్లీలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన అమలాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున మూడుసార్లు ఎంపీగా గెలిచి, ఆరు, ఏడు, తొమ్మిదవ లోక్సభల్లో ప్రాతినిధ్యం వహించారు. 1990లో పెట్రోలియం & కెమికల్స్ మంత్రిత్వ శాఖలో కూడా ఆయన పనిచేశారు. ఆయన మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



