నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ సీనియర్ లీడర్ , మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్ర కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు బీజేపీ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ కుమార్ మల్హోత్ర.. ఐదుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఢిల్లీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఢిల్లీలో పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశారు. అంతేకాదు రెండుసార్లు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మల్హోత్ర మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పార్టీ కోసం మల్హోత్ర చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.