- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా గత ఏడాది ఫిబ్రవరి 15, 2024న కూడా ఆయన ఇదే ఆసుపత్రిలో చేరి, చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు.
- Advertisement -