- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలోని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీ+4 భవనాన్ని GHMC అధికారులు సోమవారం సీజ్ చేశారు. 2017 నుంచి పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలు (రాయితీతో సహా రూ.82,91,822) కట్టని కారణంగా ఈ చర్య తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జయలలితకు సంబంధించిన వ్యక్తులకు నోటీసులిచ్చారు. అయినప్పటికీ.. వారు స్పందించకపోవడంతో జీహెచ్‌ఎంసీ సోమవారం భవనాన్ని సీజ్ చేసింది.
- Advertisement -



