Saturday, July 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబండి సంజయ్ వ్యాఖ్య‌ల‌ను ఖండించిన టీటీడీ మాజీ చైర్మన్

బండి సంజయ్ వ్యాఖ్య‌ల‌ను ఖండించిన టీటీడీ మాజీ చైర్మన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదారాబాద్‌: తిరుమలలో హిందుయేత‌రులు ఉన్నార‌ని, వారిని తొల‌గించాల‌ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. అందులో.. టీటీడీలో అన్య మతస్థులు ఉన్నారని స్వయంగా కేంద్ర మంత్రి మాట్లాడడాన్ని తాను ఖండిస్తున్నట్లు తెలిపాడు. మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. పక్కనే టీటీడీ పాలకమండలి సభ్యుడిని పెట్టుకుని అలా మాట్లాడటం సరికాదని వెల్లడించాడు. అలాగే కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ చర్య తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంపై డాడిగా భావిస్తున్నట్లు భూమన కరుణాకర్ రెడ్డి ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు.

నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీలో వెయ్యి మందికి పైగా అన్యమతస్తులు ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న వారిపై విచారణ చేపట్టాలని డిమాండ్​ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -