నవతెలంగాణ-హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ (79) కన్నుమూశారు. మార్చి 31వ తేదీన ఉదయ్‌పుర్‌లోని ఇంట్లో హారతి ఇస్తుండగా దుపట్టాకు మంటలు అంటుకోవడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరింత మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు తరలించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గురువారం సాయంత్రం కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. శుక్రవారం ఉదయ్‌పుర్‌లో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు.
గిరిజా వ్యాస్ కాంగ్రెస్‌లో ప్రముఖ నేతగా వెలుగొందారు. కేంద్రం, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేశారు. పీసీసీ అధ్యక్షురాలిగానూ సేవలందించారు. జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గానూ పని చేశారు.
కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ కన్నుమూత
- Advertisement -
RELATED ARTICLES