- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు నేడు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వం తరఫున అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో పార్థివదేహాన్ని ఉంచారు. మధ్యాహ్నం 12 గంటలకు కావూరి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
- Advertisement -



