- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి కేపీ ఉన్నికృష్ణన్ ఇవాళ (మంగళవారం) కన్నుమూశారు. కోజికోడ్‌లోని ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని వెల్లడించారు. 89 సంవత్సరాల వయస్సులో ఆయన తుది శ్వాస విడిచారు. వీపీ సింగ్ మంత్రి వర్గంలో ఉపరితల రవాణా, కమ్యూనికేషన్ల మంత్రిగా కేపీ ఉన్నికృష్ణన్ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



