- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి మోహ్సినా కిద్వాయ్ మరణించారు. వయస్సు రిత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నొయిడాలోని మెట్రో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం తెల్లవారుజామున మరణించినట్లు కుటుంబసభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5.00గంటలకు అంత్యక్రియలు జరపనున్నట్లు ఆమె అల్లుడు రజీ ఉర్ రెహ్మాన్ కిద్వాయ్ ఒక ప్రకటనలో తెలిపారు.
రాజీవ్‌గాంధీ ప్రభుత్వ హయాంలో కిద్వాయ్ పలు కీలకమైన శాఖల బాధ్యతలను చేపట్టారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యురాలిగాను పనిచేశారు. గతంలో ఆమె కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో,పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలో కూడా సభ్యురాలిగా పనిచేశారు.
- Advertisement -



