నవతెలంగాణ పుణె: కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి (81) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పుణెలో ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
1994 మే1న తమిళనాడులోని మద్రాసులో కల్మాడి జన్మించారు. మహారాష్ట్ర పుణేలోని సెయింట్ విన్సెంట్‌లో హైస్కూల్ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఫెర్గూసన్ కళాశాల నుంచి డిగ్రీ పట్టా పొందారు. 1982లో అధికారికంగా రాజకీయాల్లోకి వచ్చిన కల్మాడి.. శరద్‌పవార్ నేతృత్వంలోని కాంగ్రెస్ (ఎస్) మద్దతుతో మహారాష్ట్ర నుంచి స్వతంత్ర సభ్యుడిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు.
పీవీ నరసింహారావు ప్రభుత్వంలో రైల్వేశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా, ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల నిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా సేవలందించారు. ఆ తర్వాత తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన అనేక కీలక పదవులు చేపట్టారు. 1964 నుంచి 1972 వరకు వాయుసేనలో పైలట్‌గా పని చేశారు. 1965, 1971 ఇండో-పాక్ యుద్ధాల్లోను సైతం కల్మాడి పాల్గొన్నారు.



