Friday, January 2, 2026
E-PAPER
Homeజాతీయంకేంద్ర మాజీ మంత్రి శివరాజ్‌ పాటిల్‌ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి శివరాజ్‌ పాటిల్‌ కన్నుమూత

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కేంద్ర మాజీ మంత్రి శివరాజ్‌ పాటిల్‌ (90) అనారోగ్యంతో కన్నుమూశారు. మహారాష్ట్ర లాతూర్‌లోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. శివరాజ్‌ పాటిల్‌ లాతూర్‌ నుంచి ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

1935లో మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా చకుర్ గ్రామంలో జన్మించిన శివరాజ్‌ పాటిల్‌.. మున్సిపల్‌ కౌన్సిల్‌ చీఫ్‌గా తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. ఆయన 1972 నుండి 1978 వరకు, 1978 నుండి 1980 వరకు రెండు పర్యాయాలు లాతూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే సమయంలో సహాయ మంత్రిగా, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా, స్పీకర్ గానూ పనిచేశారు. 1991 నుంచి 1996 వరకు లోక్‌సభకు 10వ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

2004-2008 వరకు కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు. పంజాబ్‌ గవర్నర్‌గా, చండీగఢ్‌ కేంద్ర పాలిత ప్రాంతం అడ్మినిస్ట్రేటర్‌గా కూడా సేవలందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -