Tuesday, September 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ జడ్పటీసి మాతృ వినియోగం..అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే

మాజీ జడ్పటీసి మాతృ వినియోగం..అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో భాగంగా జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్ మండల మాజీ జెడ్పిటిసి మాధవరావు దేశాయి తల్లి కమలా బాయి అంత్యక్రియల్లో జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పటేల్  మరియు జుక్కల్ మాజీ శాసన సభ్యురాలు అరుణా తార గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ , ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ జెడ్పిటిసి మాధవరావ్ దేశాయి ఎంపీగా కాక ముందు తన చిన్ననాటి మిత్రుడు అని విద్యను మహారాష్ట్రలో ఒకే పాఠశాలలో అభ్యసించించడం జరిగింది అని తెలిపారు. మిత్రుడి మాతృమూర్తి చనిపోయిన విషయం తెలియగానే వెంటనే పెద్ద గుల్లా స్వ గ్రామానికి రావడం , అంత్యక్రియలు పాల్గొనడం జరిగిందని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ భగవంతుని ప్రార్థించడం జరిగింది అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -