- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మెదక్ జిల్లా తూప్రాన్ ప్రాంతంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి(D) రామారెడ్డి(M) మాజీ జడ్పీటీసీ, జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి మృతి చెందారు. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీగా గెలుపొంది.. జడ్పీ ఫ్లోర్ లీడర్‌గా ఐదేళ్లపాటు పనిచేశారు. నారెడ్డి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఈ సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. మోహన్ రెడ్డి మృతితో రామారెడ్డి మండలంతో పాటు కామారెడ్డి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
- Advertisement -



