Saturday, September 27, 2025
E-PAPER
Homeజాతీయంసెప్టిక్‌ ట్యాంక్‌ను శుభ్రం చేస్తూ ఊపిరాడక నాలుగురు మృతి

సెప్టిక్‌ ట్యాంక్‌ను శుభ్రం చేస్తూ ఊపిరాడక నాలుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – రాంచీ :   జార్ఖండ్‌లో సెప్టిక్‌ ట్యాంక్‌ను శుభ్రం చేస్తూ ఊపిరాడక ముగ్గరు సోదరులు సహా  నలుగురు వ్యక్తులు మరణించారు. గర్హ్వా జిల్లాలోని నావాడా గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఇది కొత్తగా నిర్మించిన సెప్టిక్‌ ట్యాంక్‌ అని, షట్టరింగ్‌ను తొలగించిన తర్వాత నలుగురు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు దానిలోకి ప్రవేశించారని గర్హ్వా సబ్‌డివిజనల్‌ ఆఫీసర్‌ సంజయ్  కుమార్‌ తెలిపారు. ఊపిరాడకపోవడంతో నలుగురు అపస్మారక స్థితిలోకి వెళ్లారని అన్నారు. గ్రామస్తుల సాయంతో వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించామని, అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారని అన్నారు.  మృతులను అజయ్ చౌదరి (50), చంద్రశేఖర్‌ చౌదరి (42), రాజు శేఖర్‌ చౌదరి (55)లు సోదరులు కాగా, మరో వ్యక్తిని మాల్తు రామ్‌లుగా గుర్తించినట్లు తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని, మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌ కోసం పంపామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -