- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లాలో మంగళవారం రాత్రి జరిగింది. వ్యవసాయ కూలీలు పసుపుకోతకు వెళ్లి తిరిగి వస్తుండగా.. మల్లాపూర్ మండలం ముగిలిపేట వద్దకు రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి నీటి గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
- Advertisement -



