– ఈనెల 10న ధర్నాను జయప్రదం చేయాలి
– సీఐటీయూ మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు
నవతెలంగాణ-నెల్లికుదురు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడులను తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మండల కేంద్రంలో ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం రూ.26000 అమలు చేయాన్నారు. ఈనెల 10 న మండల జిల్లా కేంద్రాలలో జరిగే స్కీమ్ వర్కర్ల ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సీఐటీయూ ఆల్ ఇండియా కమిటీ పిలుపుమేరకు జూలై 10 న కార్మిక వర్గం పెద్ద ఎత్తున కదిలి రావాలని కోరారు. ఈ నెల 10 న జరిగే ధర్నాలో అంగన్‌వాడీలు, ఆశాలు హమాలీ భవననిర్మాణ కార్మికులు, ఐకెపి వివోఏలు గ్రామపంచాయతీ కార్మికులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ ధర్నా కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో పెరుమాండ్ల పుల్లయ్య వెంకన్న నర్సయ్య, ఐలయ్య, శ్రీనివాస,్ మురళి, యాకన్న, గ్రామ పంచాయతీ హమాలి భవన నిర్మాణం రంగాల కార్మికులు తదితరులు పాల్గొన్నారు.