- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తుంగభద్ర నదిలో స్నానానికి దిగి నలుగురు మృతి చెందిన దుర్ఘటన శుక్రవారం కర్నూలు జిల్లా కోసిగి ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద జరిగింది. పెండ్లి వేడుకలో పాల్గొనడానికి కర్నాటకలోని మాన్వికి చెందిన 15 మంది రెండు రోజుల క్రితం కందుకూరు గ్రామానికి వచ్చారు. వివాహం ముగిసిన తర్వాత ఈరోజు ఉదయం వారంతా సరదాగా తుంగభద్ర నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. నదిలో దిగిన నలుగురు ఈత రాకపోవడంతో నీటమునిగి మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



